Site icon NTV Telugu

వైరస్​ బాధితులను ఆదుకునేందుకు​ సింగర్ స్మిత సాయం

కరోనా కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. కరోనా కారణంగా ఆక్సిజన్‌ అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ పాప్​ సింగర్​ స్మిత ముందుకొచ్చింది. పలు కోవిడ్​ సెంటర్లలో మొత్తంగా కలిపి 100 ఆక్సిజన్​ పడకలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటు పూర్తయినట్లు, తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు వెల్లడిస్తూ, పడకలకు సంబంధించిన ఫొటోలను స్మిత ట్వీట్​ చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా గత ఏడాది స్మిత, ఆమె భర్త శశాంక్​కు కరోనా వైరస్ సోకింది. కోలుకున్న తరువాత ఆమె ప్లాస్మా దానం చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి.

Exit mobile version