Site icon NTV Telugu

Simbu: ‘పత్తు తల’ టీజర్ పై భారి అంచనాలు…

Simbu

Simbu

కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇటివలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ‘నమ్మ సత్తం’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. రెహమాన్ కంపోజ్ చేస్తూ పాడిన సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా పత్తు తల టీజర్ ని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి ‘పత్తు తల’ టీజర్ బయటకి రానుంది. ఈ టీజర్ పై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. శింబు చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి మాస్ సినిమాలో నటిస్తుండడం ‘పత్తు తల’ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పత్తు తల సినిమా ఒరిజినల్ తమిళ సినిమా కాదు.

కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమా అయిన ‘మఫ్టీ’కి ‘పత్తు తల’ రీమేక్ వర్షన్. ఒక రౌడీ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి అండర్ కవర్ లో వచ్చిన పోలిస్ ఆఫీసర్, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు? అతని కథ ఏంటి? అనే ఎలిమెంట్స్ తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ‘మఫ్టీ’ రూపొందింది. ఇందులోని శివన్న లుక్ నే వీర సింహా రెడ్డి సినిమాలో సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి డిజైన్ చేశాడు గోపీచంద్ మలినేని. శ్రీమురళి పోలిస్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. శివన్న ప్లే చేసిన రోల్ లో శింబు నటిస్తుండగా, శ్రీమురళి పాత్రలో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నాడు. మఫ్టీలో మంచి కథ కథనాలు ఉంటాయి కాబట్టి వాటికి పెద్దగా మార్పులు చెయ్యకపోతే ‘పత్తు తల’ హిట్ అవ్వడం గ్యారెంటీనే. మరి మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version