Site icon NTV Telugu

Tollywood Couple: రెండో పెళ్లికి రెడీ అవుతున్న హీరో-హీరోయిన్?

Siddharth And Aditi Rao

Siddharth And Aditi Rao

Siddharth and Aditi Rao are getting married soon: సినీ పరిశ్రమలోనే కాదు ఇప్పుడు అన్ని చోట్లా ప్రేమలు-పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్లు వివాహం చేసుకోగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. సిద్ధార్థ్, అదితి రావు పెళ్లి ఈ ఏడాది చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఈ ఇద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జంట గురించి చాలా కాలంగా అనేక పుకార్లు తెర మీదక వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఆ విషయాన్ని ఖండించను కూడా లేదు. దీంతో సిద్ధార్థ్ మరియు అదితి రావు ఈ సంవత్సరం వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు బలంగా సూచిస్తున్నాయి.

SSMB29: రాజమౌళి- మహేష్ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లు.. ?

అదితి రావ్ హైదరీ- సిద్ధార్థ్ చాలా చోట్ల కలిసి కనిపించారు, కాబట్టి వారి సంబంధం గురించి పుకార్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. కొత్త సంవత్సర శుభాకాంక్షలతో సిద్ధార్థ్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా అదితి రావ్ వార్తలను అధికారికంగా చేసినట్టు అయిందని అంటున్నారు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల, రకుల్ ప్రీత్ వివాహం గురించి కూడా పుకార్లు ప్రారంభమయ్యాయి. ఆమె ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతోంది అంటున్నారు. 2021లో మహా సముద్రం అనే తెలుగు చిత్రానికి కలిసి నటిస్తున్న సమయంలో సిద్ధార్థ్, అదితి రావులకు పరిచయం అయితే ఈ ఇద్దరూ గతంలో వివాహాలు చేసుకున్నారు. అదితి యొక్క సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. సిద్ధార్థ్ మేఘనను నవంబర్ 2003లో వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నారు.

Exit mobile version