కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఏళ్లుగా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్, దశాబ్ద కాలంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై హింట్ ఇస్తూ వస్తున్నాడు. గతంలోనూ చాలాసార్లు తన రాజకీయ అభిలాషను బయట పెట్టారు. ఇప్పుడు ఆయన తాజా ఎత్తుగడను రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read Also : 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత
విజయ్ రాబోయే తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి ‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్’ (AITVMI) సభ్యులను అనుమతించారు. అయితే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ సభ్యులు తమ ప్రచార సమయంలో సూపర్ స్టార్ ఫోటోలను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. నిజానికి గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఇలాగే చేశారు. అక్టోబర్ 2021లో విజయ్ పార్టీ సభ్యులు పంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి 100 కంటే ఎక్కువ వార్డులలో విజేతలుగా నిలిచారు. ఇప్పుడు ఫిబ్రవరి 19న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి విజయ్ సభ్యులు తమదైన ముద్ర వేస్తారో లేదో వేచి చూడాలి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో ఈ స్టార్ హీరో పోటీ చేస్తాడా? అనే విషయంపై చర్చ నడుస్తోంది.
