నటుడు నాగ చైతన్య తన నెక్స్ట్ రొమాంటిక్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను ముగించాడు. ఈ విషయాన్ని సినిమాలో నటిస్తున్న మరో స్టార్ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “షూట్ చివరి రోజు !! మరొక పెప్పీ డ్యాన్స్ నంబర్ లోడ్ అవుతోంది” అంటూ నాగార్జున ఆ సాంగ్ కు సంబంధించిన పిక్ ను షేర్ చేశారు. ఈ పిక్ లో నాగ చైతన్య ఎరుపు రంగు సిల్క్ కుర్తాలో ఉండగా, నటి కృతి శెట్టి చీరలో అందంగా కన్పిస్తోంది. ఇక ‘బంగార్రాజు’ బృందం ఈ చిత్రంలోని మూడు పాటలతో పాటు ఇతర పోస్టర్‌లు, టీజర్‌లను విడుదల చేసింది. అవన్నీ సినిమాపై మంచి బజ్ పెంచేశాయి.
ఇక ఈ సినిమాలో నాగ చైతన్య, నాగార్జునతో పాటు ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘బంగార్రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించిన చిత్రనిర్మాత కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశారు. ‘బంగార్రాజు’ 2016లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ప్రీక్వెల్. ఈ సిఎంమాను అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ చిత్రం 2022 జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది.”బంగార్రాజు” షూటింగ్ పూర్తి చేసిన నాగ చైతన్య
