Shobana Filed Case Against Her Maid For Stealing Money: నమ్మిన వ్యక్తి మోసం చేస్తే ఎలా ఉంటుంది? వారిని కఠినంగా శిక్షించడమే కాదు, జీవితంలో మళ్లీ వారి ముఖం చూడకూడదన్నంత అసహ్యం వేస్తుంది. కనీసం పేరు ప్రస్తావించినా, కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ.. నటి శోభన మాత్రం అలా చేయలేదు. తన ఇంట్లో పనిమనిషి దొంగతనానికి పాల్పడినప్పటికీ.. ఆమె క్షమించింది. అంతేకాదు.. తిరిగి మళ్లీ ఆమెను పనిలోకి పెట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Michelle Yeoh: 2004లో నిశ్చితార్థం.. 2023లో పెళ్లి.. ఆస్కార్ నటి సుధీర్ఘ ప్రేమకథ
చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో నటి శోభన తన తల్లితో కలిసి ఉంటోంది. వీరిది రెండస్తుల భవనం కాగా.. పైభాగంలో వీరు నివశిస్తూ, కింది భాగంలో శోభన డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. తాను డ్యాన్స్ క్లాస్‌లో బిజీగా ఉంటుంది కాబట్టి.. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి పరిచర్యల కోసం విజయ అనే మహిళని పనికి చేర్చుకున్నారు. ఏడాది కాలం నుంచి ఈమె వారి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. అయితే.. కొన్ని రోజుల నుంచి తన ఇంట్లో డబ్బులు చోరీకి గురవుతున్న విషయాన్ని శోభ గుర్తించింది. దీంతో అనుమానం వచ్చి.. విజయని ప్రశ్నించింది. అందుకు ఆమె తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో.. శోభన స్థానిక తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసింది.
Huma Qureshi: ఒకట్రెండు సార్లు కాదు, చాలాసార్లు జరిగింది.. హుమా ఖురేషి ఆవేదన
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. విజయను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు ఆమె మార్చి నుంచి జూన్ నెల వరకు రూ.41 వేలు చోరీ చేసినట్లు తన నేరాన్ని ఒప్పుకుంది. దొంగలించిన డబ్బును కారు డ్రైవర్ మురుగన్ ద్వారా కూతురికి గూగుల్ పే చేసినట్లు చెప్పింది. అయితే.. పేదరికం కారణంగానే తాను ఈ పని చేశానని, తనను పని నుంచి తప్పించవద్దని పనిమనిషి కన్నీరు పెట్టుకుంది. దీంతో శోభన తన కేసు వెనక్కు తీసుకొని, తిరిగి ఆమెని పనిలో పెట్టుకుంది. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని, డబ్బులు అవసరమైతే అడగాలని పనిమనిషికి శోభన సూచించింది. శోభన తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.