NTV Telugu Site icon

Shiva Karthikeyan: ఆగస్ట్ 11న ‘మాహావీరుడు’ వస్తున్నాడు…

Shiva Karthikeyan

Shiva Karthikeyan

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి లాభాలని ఇచ్చిన హీరో, ప్రిన్స్ సినిమాతో కనీసం బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా టచ్ చెయ్యలేకపోయాడు. దీంతో తమిళనాడులో శివ కార్తికేయన్ మార్కెట్ కి డెంట్ పడింది. దాన్ని కవర్ చెయ్యాలన్నా, ఒకప్పటిలా మళ్లీ బయ్యర్స్ తనని నమ్మలన్నా శివ కార్తికేయన్ కి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆ హిట్ ని అందుకోవడానికి శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.

‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్‌’ మావీరన్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో మాహావీరుడు అనే టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆగస్ట్ 11న రిలీజ్ డేట్ ని లాక్ చేసి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. మరి శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాతో ఎలాంటి హిట్ ని అందుకుంటాడు అనేది చూడాలి. ఇదే డేట్ కి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్, సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘డీజే టిల్లు’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి కారణంగా శివ కార్తికేయన్ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ అయినా పెద్దగా ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే లేదు.

Maaveeran/Mahaveerudu Release Date Announcement Video | Sivakarthikeyan | Madonne Ashwin