Site icon NTV Telugu

Shehnaaz Gill: రోజంతా ఆ పని చేస్తేనే.. పెళ్లికి రెడీ!

Shehnaaz Gill On Marriage

Shehnaaz Gill On Marriage

Shehnaaz Gill Strange Condition On Marriage: పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు.. తమకు కాబోయే వరుడు అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ హీరోయిన్లు తమ అభీష్టాలను వ్యక్తపరుస్తుంటారు. కానీ.. బాలీవుడ్ బ్యూటీ షెహనాజ్ గిల్ మాత్రం ఒక విచిత్రమైన కండీషన్ పెట్టింది. 24 గంటలూ తన వాగుడిని తట్టుకోవడంతో పాటు తనని పొగుడుతూనే ఉండాలని.. అప్పుడే పెళ్లికి చేసుకుంటానని షాకిచ్చింది.

‘‘పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను భరించడం అంత ఈజీగా కాదు. ఎందుకంటే.. నేను ఎదుటివారు చెప్పేది వినను. అసలు అంత ఓపిక కూడా ఉండదు. కానీ.. నేను మాత్రం రోజంతా వాగుతూనే ఉంటాను. నా గురించి కూడా ఆ అబ్బాయి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. 24 గంటలు పొగుడుతూనే ఉండాలి. ఒకవేళ నా గురించి మాట్లాడటం ఆపేస్తే.. నేను మధ్యలోనే వెళ్లిపోతా. కాబట్టి, నాతో పెళ్లి అంత ఈజీ కాదు’’ అంటూ షెహనాజ్ గిల్ల చెప్పుకొచ్చింది. తన ‘మసాబా మసాబా సీజన్2’ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా.. ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని పెట్టిన ప్రపోజల్‌కు షెహనాజ్ ఆ విధంగా స్పందించింది.

కాగా.. మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ, కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే.. ‘బిగ్ బాస్ 13’లో అడుగుపెట్టిన తర్వాత ఈమె కెరీర్ మలుపు తిరిగింది. ఆ షో పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. ఫలితంగా.. వరుసబెట్టి మ్యూజిక్ వీడియోలతో పాటు మరిన్ని క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. తనకొచ్చిన క్రేజ్ దృష్ట్యా.. ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టి, బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మలా తయారైంది.

Exit mobile version