NTV Telugu Site icon

Sharukh: బుర్జ్ ఖలీఫా సాక్షిగా జవాన్ ట్రైలర్…

Sharukh

Sharukh

ఫేస్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు తెచ్చుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ ఫేజ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, అయిదేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. జనవరిలో పఠాన్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన షారుఖ్ మరో వారంలో జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సిద్ధమయ్యాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ నుంచి ఆ తర్వాత బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సాంగ్స్, పోస్టర్స్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి జవాన్ సినిమాపై రోజు రోజుకీ క్రేజ్ ని పెంచాయి. ఇప్పటికే జవాన్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉన్నాయి.

ఈ జోష్ ని మరింత పెంచుతూ మేకర్స్ జవాన్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసారు. ఆగస్టు 31న జవాన్ ట్రైలర్ బయటకి రానుంది. బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ రెడ్ షర్ట్ వేసుకోని బుర్జ్ ఖలీఫా దగ్గరికి రావాలి అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేయడం విశేషం. ట్రైలర్… టీజర్ కన్నా కొంచెం ఎక్కువ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటే చాలు జవాన్ మూవీ పఠాన్ రికార్డులకు ఈజీగా ఎసరు పెట్టగలదు. ఇదిలా ఉంటే మూవీ రన్ టైమ్ లాక్ అయ్యిందని సమాచారం. రెండు గంటల నలభై ఏడు నిమిషాల నిడివితో జవాన్ సినిమా బయటకి రానుందని సమాచారం. ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమాకి ఆ మాత్రం డ్యూరేషన్ లేకపోతే ఆడియన్స్ కి కిక్ ఉండడు. సో జవాన్ సినిమా దాదాపు మూడు గంటల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుందన్నమాట.

Show comments