కింగ్ ఖాన్ షారుఖ్, కోలీవుడ్ మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా జవాన్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ కోసం షారుఖ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడిన ఈ మూవీ ప్రీవ్యూని మేకర్స్ రిలీజ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల ప్రీవ్యూ చూస్తే పీక్ కమర్షియల్ సినిమా కనిపించడం గ్యారెంటీ. షారుఖ్ ఖాన్ తన ముప్పై ఏళ్ల కెరీర్ లో కనిపించనన్ని వేరియేషన్స్ ఈ రెండు నిమిషాల ప్రీవ్యూలో కనిపించాడు. గుండు, ఓల్డ్ లుక్, సాల్ట్ అండ్ పెప్పర్, యంగ్ లుక్, జవాన్ లుక్, వారియర్ లుక్… ఇలా చాలా గెటప్స్ లో షారుఖ్ ఖాన్ మెస్మరైజ్ చేసాడు. అట్లీ సినిమాల్లో ఉండే గ్రాండియర్, జవాన్ ప్రివ్యూ మొత్తం ఉంది. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా నయనతార కూడా స్టైలిష్ గా కనిపించడంతో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఇన్నేళ్లుగా బాలీవుడ్ డెబ్యూ కోసం వెయిట్ చేసిన నయనతార పర్ఫెక్ట్ డెబ్యూ దొరికింది. ప్రివ్యూ వీడియోలో స్పెషల్ అప్పీరెన్స్ గా దీపికా పదుకోన్ కనిపించింది.
దీపికా, షారుఖ్ ఉన్న సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. కనిపించింది కాసేపే అయినా ట్రైలర్ లో విజయ్ సేతుపతి కిక్ బాక్సింగ్ చేస్తూ కొత్తగా కనిపించాడు. ప్రియమణి స్పెషల్ రోల్ లో ఫైట్స్ చేస్తూ కనిపించింది. ట్రైలర్ మొత్తం షారుఖ్ ఖాన్ చుట్టే తిరిగింది, ముఖ్యంగా ఎండ్ షాట్ లో షారుఖ్ గుండు లుక్ లో కనిపించడం షారుఖ్ ఫాన్స్ కి మాత్రమే కాదు సినీ అభిమానులందరికీ కిక్ ఇచ్చే విషయమే. ఈ ప్రివ్యూ వీడియోని అనిరుద్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసాడు. ఫైట్స్, సెట్స్, హ్యుజ్ స్టార్ కాస్ట్… ఇలా అన్ని విషయాల్లో జవాన్ గ్రాండ్ గా ఉంది. ఒక విలేజ్ ని ఎవరు ధ్వంసం చేసారో తెలియదు కానీ ఆ విలేజ్ లో ఉండే దీపికా, షారుఖ్ ల కొడుకు షారుఖ్… తల్లికి ఇచ్చిన మాట కోసం ఏం చేసాడు అనేది జవాన్ సినిమా కథలా కనిపిస్తోంది. మరి సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్… బాక్సాఫీస్ ని షేక్ చేసి మరోసారి వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని రీచ్ అవుతాడేమో చూడాలి.
ఎవరు నేను .., ఎవర్ని కాను , అని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
Evaru nenu …, evarni kaanu, ani
Thelusukovadaaniki siddhamgaa unnaaraa?
#JawanPrevue Out Now!
#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. https://t.co/wJGwtyDHVV— Shah Rukh Khan (@iamsrk) July 10, 2023