Site icon NTV Telugu

Game Changer: ‘గేం చేంజర్’కి కొత్త డైరెక్టర్.. ఆ ఫొటోతో ఖండించిన శంకర్!

Game Changer Shankar

Game Changer Shankar

Shankar condemns sailesh kolanu directing action sequence: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా అంజలి, శ్రీకాంత్, యోగిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ లో ప్రారంభమైంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందునుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ క్రేజియస్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ చేయడం దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తూ ఉండడంతో అంచనాలు అంతకు అంతకు పెరుగుతున్నాయి. ముందు నుంచి రాంచరణ్ 15వ సినిమా అని ఈ సినిమాని సంభోదిస్తూ వచ్చారు. ఇప్పుడు దీనికి గేమ్ చేంజర్ అనే పేరు ఫిక్స్ చేశారు. శంకర్ ఆగిన భారతీయుడు సినిమాను కూడా సిద్దం చేసి రెండు సినిమాలను ఈక్వల్‌గా షూటింగ్ చేస్తున్నాడు.

Hero Vijay: పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇక సినిమాలుండవ్: విజయ్

బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నా గేమ్ ఛేంజర్ అనుకున్న సమయానికి రెడీ అవ్వడం కష్టం అని భావిస్తున్న క్రమంలో హిట్ సినిమా డైరెక్టర్‌ను రంగంలోకి దింపినట్టు ప్రచారం మొదలైంది. శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను పర్యవేక్షిస్తున్నాడని ఉదయం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శంకర్ తనదైన శైలిలో ఖండించారు. తాను గేమ్ చేంజర్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో బిజీబిజీగా ఉన్నానంటూ ఒక ఫోటోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంటే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ తానే చేస్తున్నానని ఇందులో వేరెవరు లేరని ఆయన అర్థం వచ్చేలా ఫోటో షేర్ చేశారని చెప్పొచ్చు. ఇక ఈ మధ్య చరణ్‌కు కూతురు పుట్టడంతో షూటింగ్‌ బ్రేక్ ఇచ్చిన ఈరోజే జాయిన్ అయ్యాడు. హిట్, హిట్ 2 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ప్రస్తుతం వెంకటేష్‌తో ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు.

Exit mobile version