కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లో నూటయాభై, ఓవర్సీస్ లోనే 370 కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి జవాన్ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తోంది. 600 కోట్ల నార్త్ సోలో మార్క్ కి చేరువలో ఉన్న జవాన్ మూవీ… ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా 1100 కోట్లని రాబట్టింది. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న జవాన్ సినిమా, ముప్పై రోజులు అవుతున్నా థియేటర్స్ లో సూపర్ స్ట్రాంగ్ గా రాక్ సాలిడ్ గా నిలబడింది. ఇప్పుడు మళ్లీ వీకెండ్ మొదలయ్యింది కాబట్టి జవాన్ కలెక్షన్స్ లో మళ్లీ గ్రోత్ కనిపించడం గ్యారెంటీ.
ఇప్పటివరకు ఓవరాల్ గా 1100 కోట్లకి పైగా రాబట్టిన జవాన్ సినిమా, ఫాస్టెస్ట్ 1000 క్రోర్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక్కడితో పఠాన్ సినిమా రికార్డులు బ్రేక్ అయ్యి, ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా జవాన్ నిలిచింది. పఠాన్ ని బీట్ చేసినా కూడా జవాన్ స్లో అయ్యేలా కనిపించట్లేదు. KGF 2 కలెక్షన్స్ టార్గెట్ గా జవాన్ సినిమా బుకింగ్స్ ని సొంతం చేసుకుంటుంది. KGF 2 సినిమా వరల్డ్ వైడ్ 1200 కోట్లకి పైగా రాబట్టింది. జవాన్ సినిమా మరో వంద కోట్లు రాబడితే జవాన్ సినిమా KGF 2ని క్రాస్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే జవాన్ సినిమా త్వరలోనే KGF 2ని క్రాస్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణీగంజ్ సినిమా టాక్ బాగుంది కానీ కలెక్షన్స్ లేవు, అక్టోబర్ 19 వరకూ బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు కూడా లేవు. సో మరో 10 రోజుల పాటు జవాన్ సాలిడ్ గా నిలబడితే KGF 2 రికార్డ్స్ బ్రేక్ అవుతాయి.
Jawan 🤝 Making & breaking box office records every day! 🔥
Book your tickets now!https://t.co/uO9YicOXAI
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/tPrks1X34L
— atlee (@Atlee_dir) October 6, 2023
