కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అయిదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్ స్పై యునివర్స్ నుంచి వచ్చి పఠాన్ సినిమా 2023 జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సినీ అభిమానులంతా పఠాన్ సినిమాని సాలిడ్ హిట్ చేసారు. వెయ్యి కోట్లు రాబట్టి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి పఠాన్ సినిమాతో ఊపిరిపోసిన షారుఖ్ ఖాన్, సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో తన రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తాడు అనుకుంటే పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది.
సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా ఆగస్టు 11న థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యింది. మొదటి రోజే 40 కోట్ల ఓపెనింగ్ రాబట్టి షారుఖ్-సల్మాన్ లాంటి స్టార్ హీరోల రికార్డులని కూడా బ్రేక్ చేసింది గదర్ 2. మూడు వారాల్లో గదర్ 2 సినిమా కేవలం నార్త్ లోనే 500 కోట్లని రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇస్తోంది. పఠాన్ సినిమా ఓవరాల్ గా 544 కోట్ల కలెక్షన్స్ ని కేవలం హిందీ నుంచే రాబట్టింది. మరో 44 కోట్లని గదర్ 2 రాబడితే పఠాన్ ప్లేస్ లో గదర్ 2 వచ్చి చేరుతుంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ అంతా పఠాన్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయేమో అనే కంగారులో ఉన్నారు. ఇలాంటి సమయంలో పఠాన్ రికార్డ్స్ ని కాపాడుకోవడానికి షారుఖ్ ఖాన్ ఏ స్వయంగా జవాన్ గా రాబోతున్నాడు. జవాన్ సినిమా మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీతో గదర్ 2 థియేట్రికల్ కలెక్షన్స్ దాదాపు ఎండ్ అవ్వడం గ్యారెంటీ. జవాన్ సినిమా వస్తే గదర్ 2 మూవీ పఠాన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం అనేది ఇంపాజిబుల్.