Site icon NTV Telugu

రామ్ ను ఢీకొట్టనున్న మాధవన్?

నటుడు రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా మాస్ సినిమా కథలను లైన్ లో పెడుతున్నాడు. ఇక తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రామ్ సరసన నాయికగా కృతి శెట్టిని నటించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ హై వోల్టేజ్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. రివెంజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో సీనియర్ హీరో మాధవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయనతో సంప్రదింపులు కూడా నడిపారని తెలుస్తోంది. ఇంతకుముందు ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్దం’లోను నెగిటివ్ షేడ్స్ తో మాధవన్ మెప్పించాడు. మరి ఈ సినిమాలో రామ్ ను మాధవన్ ఢీకొట్టబోతున్నాడో, లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

Exit mobile version