Senior Actress Tabu & Shilpa Shetty Injured During Shooting: సీనియర్ నటి టబు షూటింగ్‌లో గాయాలపాలైంది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘భోలా’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో పోలీస్ అధికారిణి పాత్ర పోషిస్తున్న టబుపై హైదరాబాద్‌లో ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా, ఆ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో.. అవి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కనురెప్ప పాటులో టబు కంటికి ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం సంభవించడంతో.. హీరో అజయ్ దేవగన్ సినిమా షూటింగ్‌కు విరామం ప్రకటించారు.
అటు.. మరో సినియర్ నటి శిల్పాశెట్టి కూడా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘వాళ్లు రోల్ కెమెరా.. యాక్షన్.. బ్రేక్ లెగ్ అన్నారు. నేను అదే చేశాను. దీంతో 6 వారాలపాటు షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. ఈ గాయం నుంచి త్వరగా కోలుకొని, మునుపటి కంటే మరింత ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపింది. అప్పటివరకూ తనకోసం ప్రార్థించండని, ప్రార్థనాలు ఎప్పటికీ మంచి ఫలితాల్ని ఇస్తాయని శిల్పా పేర్కొంది. కాగా.. రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ పోలీసు ఆఫీసర్’ వెబ్ సిరీస్‌లో.. సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్‌రోల్ పోషిస్తుండగా, శిల్పా పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది.
