గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పలకడానికి రీసెంట్ గా సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిరు బృందంలో మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, అలీ, పోసాని వంటి ప్రముఖులు ఉన్నారు. అంతా కలిసి ఒకే ఫ్లైట్ లో విజయవాడ వెళ్లి, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో సీఎంతో కలిసి సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. భేటీ అనంతరం సీఎం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఈ బృందం తెలిపింది. అయితే ఈ భేటీపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ భేటీపై సీనియర్ యాక్టర్ నరేష్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Also : Review : డి.జె. టిల్లు
“సీఎంతో భేటీ అభినందనీయం. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తులు, సుహృద్భావ పరిష్కారాలు, తీర్మానాలు, అధికారికంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించబడిన టాలీవుడ్ పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబిస్తూ ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందడంపై ఫిలింఛాంబర్ నేతృత్వంలోని వర్క్ షాప్ అవసరం. దీనిని త్వరలో ఆశిస్తున్నాము” అంటూ నరేష్ ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి బృందం జరిపిన భేటీపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం మెగాస్టార్ సినీ పరిశ్రమ సమస్యలను ముందుకు రావడంపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
