హర్ష కానుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సెహరి’. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇదే నెల 11న జనం ముందుకు వచ్చింది. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రశాంత్ విహారి సంగీతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేయగా, అభినవ్ గోమటం సిట్యుయేషనల్ కామెడీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగానూ మంచి పేరు తెచ్చుకున్న ‘సెహరి’ ఇదే నెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనంకు మరింత గుర్తింపు ఓటీటీ విడుదల తర్వాత లభిస్తుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాతలు జ్ఞానేశ్వర్ ద్వారక, అధ్వయ జిష్ణు రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Bheemla Nayak Pre-release Event : ‘పుష్ప’ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఆ బాధ్యత పోలీసులకే !
