మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త సినిమా ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అయితే యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పాత్రను పరిచయం చేస్తూ వదిలిన ‘బసవన్న’ పాట ఎంతో అద్భుతంగా ఉంది.
ఇందులో బసవన్నగా ధ్రువ సర్జా అద్భుతమైన పాత్రలో కనిపించబోతోన్నట్టుగా ఈ పాటను చూస్తే అర్థం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. ఈ సినిమాలో ‘బసవన్న’ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ పాటలో చూపించారు. కాసర్ల శ్యాం లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండగా.. నకాస్ అజిజ్, ఎల్. కీర్తన గాత్రం శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటకు లలితా శోభి, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ మూవీకి ధ్రువ సర్జా మెయిన్ అస్సెట్‌గా మారబోతోన్నాడని ఈ పాట స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
