Aa Ammayi Gurinchi Meeku Cheppali: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. “మీరే హీరోలా ఉన్నారు.. మరి తెరంగేట్రం ఎప్పుడు చేస్తారు” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో సుధీర్ డైరెక్టర్ గా కనిపిస్తున్నాడు.
ఇక వీడియోలో తాను తీసిన మిస్సైల్ అనే సినిమా ప్రెస్ మీట్ లో రిపోర్టులతో కలిసి ముచ్చటిస్తునట్లు కనిపిస్తోంది. మాటలనే.. లిరిక్స్ గా ఎంతో క్యాచీగా రాసాడు రామజోగయ్య శాస్త్రి. ఇక ఈ సాంగ్ లో ఒక డైరెక్టర్ గా ఇండస్ట్రీకి హిట్లు ఇచ్చింది తానే అని, తానొక లెజెండ్ అని చెప్పుకొంటూ కనిపించాడు సుధీర్ బాబు. లిరిక్స్ కు తగ్గట్టే సుధీర్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. పొడుగాటి జుట్టు, గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. ఇక వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను విజయ్ ప్రకాష్ తమ మెస్మరైజ్ వాయిస్ తో ఆలపించాడు. సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబోలో సమ్మోహనం, వి చిత్రాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
