NTV Telugu Site icon

Tenant: టెనెంట్ ఎదురింట్లో, పక్కింట్లో జరిగే కథ!

Tenant Satyam Rajesh

Tenant Satyam Rajesh

Satyam Rajesh Interview for Tenant Movie: పొలిమేర, ‘పొలిమేర-2’తో సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించగా మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న క్రమంలో హీరో సత్యం రాజేష్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ విశేషాలు…

అసలు టెనెంట్ ఎవరు?
ఇది అందరికీ తెలిసిన కథే. ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ, ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్‌ఫెక్ట్‌గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది, సినిమా థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది.

టెనెంట్‌కు ‘A’ సర్టిఫికెట్ ఎందుకు?
సినిమా ట్రైలర్‌లో మేడమీద నుంచి పడి చనిపోయే సీన్ ఉంది, అది సినిమాటిక్‌గా చూపిస్తే క్లీన్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ రియాలిటీకి దగ్గరగా చూపిస్తేనే ఆడియన్స్‌కు ఒరిజినల్ ఫీల్ కలుగుతుంది. ఈ సీన్‌ రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్లే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఇలాంటి సినిమాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు?
నేను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నా, యాక్షన్, డ్యాన్స్‌లు, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్ లాంటి సినిమాలను ఎంచుకోను. నేను ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలని నా కోరిక. ఇప్పుడు ఎవరితో పోటీ పడాలని కోరిక నాకు లేదు.

ఓటీటీ కథని చెప్పారు కానీ థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు?
కథ చాలా బాగుంది, చిన్న సినిమాగా స్టార్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకుని ఇంకా ఇంప్రూవ్ చేశాం.

ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుంది?
ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా, ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది, సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.

టెనెంట్‌లో ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎంతవరకూ ఉంటాయి?
ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ చూసి ఆడియన్స్ సింపతీతో బయటకు వస్తారు.