Site icon NTV Telugu

Sharath Kumar: చిరంజీవి అలా చేస్తాడనుకోలేదు.. ఎమోషనల్ అయిన రాధిక భర్త

Sharath Kumar

Sharath Kumar

Sharath Kumar: మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కు మాస్టర్.. ఎంతోమందికి గాడ్ ఫాదర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. సినిమాల పరంగానే కాకుండా ఎంతోమందికి ఆయన చేసిన సాయం మరువలేనివి. ఎంతోమంది ప్రముఖులు చిరు చేసిన సాయం గురించి మీడియా ముందే ఎన్నోసార్లు చెప్పుకొచ్చేవారు. అది చిరంజీవి అంటే.. స్వయం కృషితో ఎదిగిన ఒక హీరోకు మాత్రమే తాను పడ్డ కష్టాలు మరెవ్వరు పడకూడదనే తాపత్రయం ఉంటుంది. ఇక నేడు మెగాస్టార్ పుట్టినరోజు.. అభిమానులకు పండగ రోజు. సోషల్ మీడియా వేదికగా చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు ప్రముఖులు కూడా చిరు చేసిన సేవలను, సహాయాలను చెప్తూ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కు ఒకానొక సమయంలో చేతిలో డబ్బులేకపోతే చిరు చేసిన సహాయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ఎప్పటిదో అయినా నేడు చిరు బర్త్ డే సందర్భంగా మరోసారి దీన్ని మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఒక వీడియోలో శరత్ కుమార్ చిరు గురించి మాట్లాడుతూ “నేను ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చి చిరుతో ఒక సినిమా చేయడానికి డేట్స్ ఇప్పిస్తే అందులో వచ్చే లాభాల్లో నాకు వాటా ఇస్తాను అన్నాడు. నేను చిరు ఒప్పుకొంటాడో లేదో అనుకుంటూనే వెళ్లి ఆయనను అడిగాను. అప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొని డేట్స్ ఇవ్వడమే కాకుండా రెమ్యూనిరేషన్ కూడా తీసుకోలేదు. అతడి మంచి స్నేహితుడు చిరంజీవి. ఆయనతో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో కనిపించడం ఎంతో అదృష్టం. ఆ వచ్చిన డబ్బుతోనే నేను నా అప్పులు మొత్తం తీర్చేశాను” అంటూ కంటతడి పెట్టుకొన్నారు. అలాంటి స్నేహితుడు ఉండడం చాలా అరుదు అని శరత్ కుమార్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చిరుకు, రాధికకు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆమె నిర్మాణ సంస్థలో చిరు ఒక కొత్త సినిమాను ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version