కేరళకు చెందిన యువ నటుడు శరత్ చంద్రన్ (37) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విషయాన్ని అతని సహనటులు తెలియచేశారు. 2017లో వచ్చిన మలయాళ చిత్రం ‘అంగమలై డైరీస్’ మూవీలో శరత్ చంద్రన్ కీలక పాత్ర పోషించాడు. ఐటీ రంగంలో పనిచేసి, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మల్లూవుడ్ లోకి అడుగుపెట్టిన శరత్ చంద్రన్… ఆ తర్వాత నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘అనీష్య’ నటుడిగా అతనికి తొలి చిత్రం. ఆ తర్వాత ‘అంగమలై డైరీస్, కూడే, ఒరు మెక్సికన్ అపరథ, సి.ఐ.ఎ.’ తదితర చిత్రాలలో నటించాడు. అతను కీలక పాత్ర పోషించిన ‘అంగమలై డైరీస్’ మూవీ తెలుగులో ‘ఫలక్ నుమా దాస్’ పేరుతో రీమేక్ అయ్యింది. శరత్ చంద్రన్ మృతికి కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. కేసును రిజిస్టర్ చేసి పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నట్టు తెలిసింది.
