సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక మహేష్ సినిమా రిలీజ్ అవుతుండం ఆలస్యం వారి హంగామా మొదలైపోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట మే 12 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్న విషయమూ విదితమే. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే వేదిక వద్దకు చేరుకొని హంగామా మొదలు పెట్టారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు స్లోగన్స్ తో ఆ వేదిక దద్దరిల్లిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు పరుశురామ్ మహేష్ వింటేజ్ లుక్ ను మళ్లీ చూపించడంతో మహేష్ ఫ్యనస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ భారీ భారీ కటౌట్స్ తో పోలీస్ గ్రౌండ్స్ పండగ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.. మరి ఇప్పుడే ఇలా ఉంటే .. మహేష్ వచ్చాకా వీరి రచ్చను తట్టుకోవడం కొంచెం కష్టమేనేమో చూడాలి.
