Site icon NTV Telugu

Hiramandi First Look: భన్సాలీ ఫ్రేమింగ్ కి ఫిదా అవ్వాల్సిందే…

Hiramandi

Hiramandi

ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే డెఫినెట్ గా టాప్ 3లో ఉండే దర్శకుడు ‘సంజయ్ లీలా బన్సాలీ’. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో, వార్ సినిమాల్లో కూడా ఎమోషన్స్ ని ప్రెజెంట్ చెయ్యడంలో సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. భారి సెట్స్ లేకుండా, హెవీ లైట్స్ వాడకుండా, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని పెట్టడంలో సంజయ్ లీలా భన్సాలీకి స్పెషల్ మార్క్ ఉంది. హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే సంజయ్ లీలా భన్సాలీ ఒటీటీలోకి ఎంటర్ అవుతూ చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హీరామండి’. నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ భారి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేసారు.

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ మరియు అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించిన హీరామండి ఫస్ట్ లుక్ వీడియోలో భన్సాలీ తాలూకు గ్రాండ్ మేకింగ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ వ్యూవర్స్ ని స్టన్ చేస్తాయి. భన్సాలీ ట్రేడ్ మార్క్ ‘గోల్డెన్ కలర్ ప్యాలెట్‌’తో… ఎల్లో ఎక్కువగా వాడుతూ… పర్ఫెక్ట్ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడానికి రెడీ అయ్యాడు భన్సాలీ. హీరామండి కంప్లీట్ గా ప్రీఇండిపెండెన్స్ ఎరాలో సెట్ అయ్యి ఉంది. వేశ్యల జీవితాల ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు భన్సాలీ అనే మాట ఉంది కానీ హీరామండి ఫస్ట్ లుక్ వీడియోలో… ఈ కథలో వేశ్యల అంశం కన్నా పెద్ద విషయం ఎదో ఉందనే హింట్ ఇచ్చాడు భన్సాలీ. మరి ఈ అంబీషియస్ ప్రాజెక్ట్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

Exit mobile version