Site icon NTV Telugu

Samantha : నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు : సమంత

Samantha On Imdb

Samantha On Imdb

Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మాగతా మారి తీసిన మూవీ శుభం. ట్రా లాలా బ్యానర్ మీద తీసిన ఈ సినిమాను ప్రవీణ్‌ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేసింది. తన పర్సనల్ విషయాపలై కూడా స్పందించింది. నేను ఎప్పుడూ సక్సెస్ ను తలకు ఎక్కించుకోను. అలా చేస్తే మనల్ని కిందకు పడేస్తుందని తెలుస్తోంది. నా కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లు చూశాను. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ కూడా చూశాను. కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా బయట పడాలో నిత్యం నేర్చుకుంటూ ఉంటాను. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది.

Read Also : TFI: టీఎఫ్ఐ బానిసల కళ్ళు జిగేల్ మనే ఫ్రేమ్.. కుర్ర డైరెక్టర్లు అంతా ఒకే చోట!

అప్పటి వరకు నేను అలాంటి సాంగ్స్ చేయలేదు. ఎందుకంటే నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేక్షకులు కూడా నన్ను అలా చూసి యాక్సెప్ట్ చేస్తారో లేదో అని టెన్షన్ పడ్డాను. ఆ మూవీ సాంగ్ కూడా టెన్షన్ పడుతూనే చేశాను. కానీ ప్రేక్షకులు దాన్ని చాలా పెద్ద హిట్ చేశారు. కాకపోతే అలాంటి సాంగ్స్ మళ్లీ చేయాలని అనుకోవట్లేదు. ఇకపై చేయను కూడా. ప్రస్తుతానికి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలను చేయాలని చూస్తున్నాను. త్వరలోనే మా ఇంటి బంగారం మూవీ సెట్స్ లో పాల్గొంటా. మరిన్ని సినిమా అప్డేట్లుకూడా త్వరలోనే వస్తాయి అంటూ తెలిపింది సమంత.

Read Also : Sri Lanka: ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు పడి 21 మంది మృతి..

Exit mobile version