Site icon NTV Telugu

బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పిందా ?

Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మరో సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి.

Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. “లయన్” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా నయన్ ను హీరోయిన్ గా అనుకోలేదని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అట్లీ మొదట సమంతని సంప్రదించాడు. కానీ షారూఖ్ ఖాన్ సినిమాకి సమంత నో చెప్పడంతో తర్వాత ఆ పాత్ర నయనతార ఖాతాలో పడింది. ఇండస్ట్రీ బజ్ ప్రకారం షారూఖ్ ఖాన్, అట్లీ సినిమా బ్యాంక్ దోపిడీ ఆధారంగా తెరకెక్కుతోంది.

కాగా షారూఖ్ ఖాన్ చివరిసారిగా ఆనంద్ ఎల్. రాయ్ ‘జీరో’ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లతో కలిసి నటించారు. మరోవైపు సమంత చివరి సారిగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో కనిపించింది.

Exit mobile version