NTV Telugu Site icon

Samantha : స్కామ్‌స్టర్స్… విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ పై రియాక్షన్

Samantha

Samantha

ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే సామ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “VD 11” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా, చిత్రబృందం అంతా కలిసి సామ్ ను ఫేక్ షూటింగ్ కోసం రెడీ చేసి, సడన్ గా బర్త్ డే విషెస్ చెప్పి థ్రిల్ చేశారు. పైగా అందరూ కలిసి సమంతతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ థ్రిల్లింగ్ సర్ప్రైజ్ పై స్పందించిన సామ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Read Also : Amazon Prime : తెరపైకి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్… వరుస వెబ్ సిరీస్‌ ల హంగామా

‘స్వీటెస్ట్ సర్ ప్రైజ్’ అంటూనే “సినిమాకు సంబంధించి మాకు చాలా పని ఉంది. కానీ అక్కడి గడ్డకట్టే చలి కూడా ఈ స్కామ్‌స్టర్‌లను నన్ను సర్ప్రైజ్ చేయడాన్ని ఆపలేకపోయింది” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక సామ్ తనను విష్ చేసిన అభిమానులందరికీ థ్యాంక్స్ నోట్ కూడా రాసింది. “నా పుట్టినరోజు సందర్భంగా ప్రేమ, శుభాకాంక్షలను కురిపించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు! మీ అందరి నుండి నాకు లభించిన ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూల వైబ్‌లకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని! నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.