Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామిడీ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ నిన్న వైజాగ్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో వేడుక మరింత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు రాజ్ నిడిమోరు. ఈ చిత్రానికి కథ అందించిన ఆయన, సమంత భర్తగానూ అందరికీ సుపరిచితుడు. వేదికపై మాట్లాడిన ఆయన, ముందుగా అభిమానులను సీక్వెల్ కావాలా అని ప్రశ్నించగా, అక్కడున్న ప్రేక్షకులు హర్షధ్వానాలతో తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆ స్పందన చూసిన అనంతరం, ‘మా ఇంతి బంగారం’ రెండో భాగం రూపొందనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తన మనసులో ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన ఆలోచన ఉందని రాజ్ నిడిమోరు వెల్లడించారు. మొదటి భాగాన్ని రూపొందించిన అదే టీం ఈ ప్రాజెక్ట్‌పై కూడా పని చేస్తుందని తెలిపారు. మరో రెండేళ్లలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇందులో మొదటి భాగం కంటే రెట్టింపు వినోదం, రెట్టింపు ఉత్సాహం ఉండేలా కథను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఇటీవల కాలంలో భారతీయ సినీ పరిశ్రమలో సీక్వెల్‌ల ట్రెండ్ మరింత బలపడుతోంది. మొదటి భాగం విజయాన్ని కొనసాగిస్తూ, అదే పాత్రలతో మరింత ఆసక్తికరమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన పాత్రలను మళ్లీ తెరపై చూడాలని ఆసక్తి చూపుతుండటంతో, సీక్వెల్‌లకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం 2’ ప్రకటన కూడా అదే అంచనాలను మరింత పెంచుతోంది. సమంత, దర్శకురాలు నందిని రెడ్డి, రచయిత రాజ్ నిడిమోరు కలిసి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. కథ ఎలా ఉండబోతోంది, మొదటి భాగంలోని పాత్రలే కొనసాగుతాయా లేదా కొత్త పాత్రలు చేరతాయా వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే సీక్వెల్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం మాత్రం ఇప్పటినుంచే కనిపిస్తోంది.
#MaaIntiBangaaram SEQUEL ANNOUNCED at the Success Meet in Vizag 💥💥💥💥
Book your tickets now!
🎟️ https://t.co/YhsGMjgdkP@TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1 @MukhiSree… pic.twitter.com/O45JTbfRdw— Duddi Sreenu (@PRDuddiSreenu) June 26, 2026

