స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఉత్తర భారతానికి వెళ్ళిన స్టార్ హీరోయిన్ సమంత… తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో రిషీకేశ్ లోని మహర్షి మహేశ్ యోగి ఆశ్రమాన్ని సందర్శించినట్టు పేర్కొంది. అంతేకాదు… అక్కడి కొన్ని ఫోటోలనూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 1968లో మహేశ్ యోగి ఆశ్రమానికి బీటిల్స్ బృంద సభ్యులు వెళ్ళారు. అక్కడే కొన్ని రోజులు ఉండి ‘అతీంద్రియ ధ్యానం’ను అభ్యసించారు. ఆ సమయంలో వారు దాదాపు 48 పాటలను ఇదే ఆశ్రమంలో కంపోజ్ చేశారని సమంత తెలిపింది. బీటిల్స్ స్వరాలు సమకూర్చిన ప్రదేశంలో తాను ఇప్పుడు నిల్చున్నానని సమంత పేర్కొనడం విశేషం. సహజంగా సినిమాల షెడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత కాస్తంత విశ్రాంతి కోసం హీరోలు, హీరోయిన్లు విహార యాత్రలకు వెళుతుంటారు. అలానే సమంత ఇటీవల ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. అంతేకాదు…. ఆ వెంటనే నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుంటున్న విషయాన్ని కూడా అభిమానులకు తెలిపి, ఇలా ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరింది. శిల్పా రెడ్డి ఓ రోజు క్రితమే సమంత, తాను యమునోత్రి కి బయలు దేరినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మొత్తానికి పర్ ఫెక్ట్ ప్లాన్ తో ఈ స్నేహితురాళ్ళిద్దరూ తమ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయబోతున్నారు. మరి రాబోయే సమయంలో సమంత ఇంకెన్ని ఆసక్తికరమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుందో చూడాలి.
మహర్షి మహేశ్ యోగి ఆశ్రమంలో సమంత!
