టాలీవుడ్ హీరోల సతీమణులలో అల్లు స్నేహరెడ్డికు సోషల్ మీడియాలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాత్రం హీరోయిన్ కి తీసిపోని అందం, ఫిజిక్ ఆమె సొంతం.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా స్నేహ అందం మాత్రం చెక్కుచెదరలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తగ్గట్టే స్టైలిష్ వైఫ్ దొరికింది. ఇక మీ ఎప్పటికప్పుడు తన డిజైనర్ డ్రెస్ ల్లో ఫోటోషూట్లను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా స్నేహ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. మల్హోత్ర డిజైన్ చేసిన బ్లాక్ కలర్ శారీ విత్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో స్నేహారెడ్డి అందరిని ఆకర్షిస్తోంది.
హీరోయిన్లు సైతం ఆమె ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా స్నేహారెడ్డి ఫోటోలపై స్పందించింది. హాట్ అంటూ రెడ్ ఎమోజీ ని యాడ్ చేసి కామెంట్ పెట్టింది ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కరే స్నేహకు స్టైలిస్ట్ గా ఉన్నాడు. ఇటీవలే పుష్ప చిత్రంలో సామ్ , బన్నీతో కలిసి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోల భార్యలందరితో సామ్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉందన్న సంగతి తెలిసిందే.
