ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్సీబీ అధికారి వాఖండే ఆర్యన్ ను కేసు నుంచి తప్పించడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను కేసు నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఈ కేసు పలు పలుపులు తిరుగుతోంది. అయితే డబ్బు రికవరీకి సంబంధించి సామ్ డిసౌజా అకా సెన్విల్లే స్టాన్లీ డిసౌజా నేడు ఎంసీబీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఆర్యన్ ను కేసు నుంచి తప్పించడానికి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ… కిరణ్ గోసావిని 25 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి సంప్రదించినట్లు సామ్ ఆరోపించాడు. ఈ మేరకు కిరణ్ గోసావి, దద్లానీ నుంచి 50 లక్షల రూపాయల మనీ తీసుకున్నారని కూడా సామ్ ఆరోపించాడు. దీంతో ఈరోజు జరిగే విచారణలో ఆర్యన్ ఖాన్ కేసును క్లోజ్ చేసేందుకు షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో అలాంటి ఒప్పందం ఏదైనా జరిగిందా ? అని సామ్ డిసౌజా నుండి ఎన్సీబీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. గతంలో రెండు సార్లు సామ్‌కు సిట్ సమన్లు పంపినా హాజరు కాలేదు.
Read Also : కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి
ఆర్యన్ డ్రగ్స్ కేసు సహా 6 కేసులను ఎన్‌సీబీ సిట్ విచారిస్తోంది. దీనికి సంబంధించి శామ్ డిసౌజాను కూడా విచారించనున్నారు. సిట్ సమన్ల ప్రకారం సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య హాజరు కావాలని సామ్‌ను కోరింది. నిజానికి ఈ విషయంలో ప్రభాకర్ సాయిల్ తర్వాత శామ్ డిసౌజా ప్రకటన చాలా కీలకం. వాస్తవానికి ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసు నుండి తప్పించడానికి ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి డబ్బు వసూలు చేస్తున్నాడని సామ్ ఇటీవల పేర్కొన్నాడు. అతను షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో 18 కోట్ల డీల్ చేశాడు. ఈ విషయంలో ఎన్‌సిపి సభ్యుడైన సునీల్ పాటిల్, గోసావికి సపోర్ట్ ఇస్తున్నారని సామ్ డిసౌజా చెప్పుకొచ్చాడు.
గోసావి, సామ్ మధ్య ఒప్పందం
కొన్ని రోజుల క్రితం కిరణ్ గోసావికి బాడీ గార్డ్ ప్రభాకర్ సెయిల్, గోసావి, సామ్ డిసౌజా మధ్య జరిగిన ఫోన్ సంభాషణను తాను విన్నానని పేర్కొన్నాడు. ఆర్యన్ ఖాన్ కేసును క్లోజ్ చేసేందుకు 25 కోట్ల డీల్ కుదుర్చుకోవాలని గోసావి సామ్‌ను అడిగాడు. అప్పుడు గోసావి ఈ డీల్‌ను 18 కోట్లకు ఫిక్స్ చేయమని కోరాడు. షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో ఈ డీల్ చేయమని గోసావి సామ్‌ని అడిగాడు. 18 కోట్లలో 8 కోట్లు సమీర్ వాంఖడేకి ఇవ్వాల్సి ఉంటుందని గోసావి అనడం ప్రభాకర్ విన్నాడట. ఈరోజు జరిగే విచారణలో ఏం బయట పడుతుందో చూడాలి.
