Salman Khan : చిక్కుల్లో భాయ్… తెరపైకి జర్నలిస్ట్ పై దాడి కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan మరోమారు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో అంతే తరచుగా వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటాడు. తాజాగా జర్నలిస్ట్ పై సల్మాన్ దాడి కేసుతెరపైకి వచ్చింది. 2019లో జరిగిన ఈ వివాదానికి సంబంధించి ఓ జర్నలిస్టు చేసిన ఫిర్యాదుపై నటుడు సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్‌లకు అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదైనట్లు పోలీసు నివేదికలో పేర్కొన్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఆర్ ఖాన్ మంగళవారం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం సమన్లు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. సల్మాన్ ఖాన్, షేక్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అశోక్ పాండే తన ఫిర్యాదులో కోరారు.
Read Also : Boycott RRR in Karnataka : అవమానం అంటూ కన్నడిగుల ఆగ్రహం… మేకర్స్ కు షాక్
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
అసలు ఆ దాడి సంగతేంటంటే… 2019 ఏప్రిల్ 24న ముంబై వీధిలో సల్మాన్ సైకిల్‌పై వెళుతుండగా కొందరు మీడియా వ్యక్తులు ఆయన ఫోటోలను తీశారట. అదే సమయంలో ఫోటోలు తీస్తున్న తన మొబైల్ ఫోన్‌ను పగలగొట్టిన సల్మాన్ అక్కడే వాగ్వాదానికి దిగి, తనను బెదిరించాడని పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎన్ నగర్ పోలీసులను కోర్టు గతంలో ఆదేశించింది. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం సల్మాన్ గాడ్ ఫాదర్, టైగర్ 3, కభీ ఈద్ కభీ దీపావళి వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?