సెలబ్రెటిల చూట్టు ఫ్యాన్స్ తో పాటుగా శత్రువులు కూడా ఉంటారు. వారిని బ్లాక్‌మెయిల్ చేయడం, బెదిరించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి బాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఇందులో భాగంగా తాజాగా హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి కత్తిపోట్లకు కారణమయ్యారు. దీంతో సైఫ్‌ను ఆస్పత్రికి తరలించగా మొత్తం ఆరు కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాదు రెండు సర్జరీలు నిర్వహించి కత్తి ముక్కను బయటకు తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారట. ఈ విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్‌గా విచారణ మొదలు పెట్టారు.
ఇక సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటన గురించి మిగతా సెలబ్రెటిలు వారి సోషల్ మీడియాలో భాగంగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఎమోషనల్ అవుతూ ‘ఇది మా కుటుంబానికి చాలా కఠినమైన రోజు,అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు తెలిసి తెలియని కథనాలను ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్న’ అని ఇన్ స్టా లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఇలాంటి సంఘటనలు ఒక బాలీవుడ్ మాత్రమే కాదు ముంబైలో పారిశ్రామికవేత్తలు కూడా ఎదురుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఒక సారీ రూ.20 కోట్లు ఇవ్వకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తానని మెయిల్‌లో బెదిరించాడట. ఈ వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.