Sai Rajesh Reveals the story behind controversy with vishwak sen: ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నచ్చి బన్నీ ఒక అప్రిషియేషన్ మీట్ పెట్టగా అందులో ఓ యువ హీరో తన స్క్రిప్ట్ వినడానికి కూడా నిరాకరించాడని ఆ సమయంలో ఆనంద్ తనను నమ్మడంతో అతనికి ఎలా అయినా సాలిడ్ హిట్ ఇవ్వాలని చాలా తపన పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం సాయి రాజేష్ వెల్లడించలేదు కానీ అప్పుడు కధ చెప్పడానికి ట్రై చేస్తే వినకుండా నో చెప్పింది విశ్వక్ సేన్ అని ప్రచారం జరిగింది. ఈ విషయం మీద సాయి రాజేష్ vs విశ్వక్ సేన్ అనేలా కొన్ని ట్వీట్ల యుద్ధం కూడా నడిచింది ఇక ఇప్పుడు తాజాగా అసలు జరిగింది ఏంటి ఏ అంశం మీద సాయి రాజేష్ స్పందించాడు. విశ్వక్ సేన్ కి మీరు కథ ఏమైనా చెప్పారా? అని అడిగితే నేను చెప్తాను అన్నాను ఆయన వినను అన్నాడని సాయి రాజేష్ అన్నారు. అది ఎందుకు అంటే విశ్వక్ సేన్ చెప్పినదాని ప్రకారం నో చెప్పినప్పుడు నో అని తీసుకోవాలి మీరు సక్సెస్ లో ఉన్నప్పుడు ఈ విషయాన్ని దెప్పి పొడవద్దని అన్నాడని అన్నారు.
TG Vishwa Prasad: అంబటి రాంబాబువి గాలి మాటలు.. నేను సీరియస్ గా తీసుకుంటే ఎలా బుద్ది చెప్పాలో తెలుసు
అసలు నిజంగా తాను ఎక్కడా ఆయన పేరు కూడా తీయలేదని, తాను బయట పెట్టలేదు, చెప్పలేదని అన్నారు. నేను అసలు మొన్న ఒక ఛానల్ లో అడిగితే కూడా ఆయన కాదని చెప్పానని సాయి రాజేష్ అన్నారు. నాకు నో చెప్పిన విధానం నచ్చలేదు, నో చెప్పచ్చు కానీ ఇలా చెప్పడం బాలేదని అన్నారు. గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వెళ్లినపుడు ఆయన నో అన్నారని, వీరు కొంచెం పాలిష్డ్ గా చెప్పాల్సింది ఉన్నది ఉన్నట్టు చెప్పఁడంతో బాధ పడ్డానని అన్నారు. ఇక ఈ విషయంలో తనకు మంచే జరిగిందని, ఇక విశ్వక్ సేన్ ఎందుకు అని ఉంటారు అనేది అర్ధం చేసుకోగలనని అన్నారు. తన ప్రయారిటీ లిస్టులో నేను ఉండక పోవచ్చు కదా, నేను కూడా తనని ఏరోజు ఇన్సల్ట్ చేయలేదు ఒక మాట కూడా అనలేదు. నేను ఆనంద్ నన్ను నమ్మాడు అని చెప్పిన క్రమంలో ఈ ప్రస్తావన రావడంతో విషయం చాలా దూరం వెళ్లిందని చెప్పుకొచ్చారు.
