Site icon NTV Telugu

Top Gear: రొమాన్స్‌లో ‘టాప్ గేర్’ వేసిన ఆది సాయి కుమార్!

Top Gear Romance

Top Gear Romance

Sai Kumar Top Gear: ఈ యేడాది ఇప్ప‌టికే ఆది సాయికుమార్ న‌టించిన ”అతిథి దేవో భ‌వ‌, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో” సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఆది.. త్వరలోనే ‘టాప్ గేర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్ని హంగులతో ఈ ‘టాప్ గేర్’ సినిమా తెర‌కెక్కుతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ భిన్న‌మైన‌ అనుభూతిని ఇస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ‘టాప్ గేర్’ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, త్రీడీ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్‌ను చూపిస్తోంది. యాక్షన్‌లోనే కాదు.. రొమాన్స్‌లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్‌ రియా సుమన్‌, ఆది మ‌ధ్య‌ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ మూవీ కోసం పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన హర్ష వర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Exit mobile version