Site icon NTV Telugu

Sahkutumbanaam: “సఃకుటుంబానాం” అంటున్న రాజేంద్ర ప్రసాద్ అండ్ కో!

Sahakutumbanam

Sahakutumbanam

Sahkutumbanaam First Look & Motion Poster Unveiled: రామ్ కిరణ్ హీరోగా పరిచయం అవుతూ ఉండగా మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’. మహాదేవ గౌడ్ హెచ్ ఎన్ జి సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్న ‘సఃకుటుంబానాం’ సినిమా ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఉదయ్ శర్మ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అధికారికంగా మోడలింది. ఇక ఈ క్రమంలో నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని, అచ్చమైన తెలుగింటి టైటిల్ అని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారని అన్నారు. రేషన్ కార్డు డిజైన్ లా ఉన్న పోస్టర్ బట్టి సినిమాకూడా మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుంది అనేలా ఉందని, ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Chiranjeevi: బాసూ, అదిరింది నీ గ్రేసు.. ఎలా ఇలా?

సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, నటులు సత్య, రాజశ్రీ నాయర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ, రమేష్ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మధు దాసరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ రేషన్ కార్డు లాగా ఉన్న ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ సినిమాకి మణిశర్మ చాలా పెద్ద అసెట్ అని అన్నారు. కంటెంట్ ని నమ్మి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారని, రీసెంట్ గా ఇంత మంది ఆర్టిస్టులు ఇంత మంచి కాంబినేషన్స్ తో ఏ సినిమా రాలేదు, కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అని నిరూపిస్తారని అన్నారు..

Exit mobile version