NTV Telugu Site icon

Sagileti katha: అందుకే ‘సగిలేటి కథ’ పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్!

Mks Manoj

Mks Manoj

Sagileti katha Poster designer MKS Manoj Comments: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న ‘సగిలేటి కథ’ రిలీజ్ కి సిద్ధమైంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించగా హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి నుంచి ఆదరణ లభించింది. అయితే ఈ మూవీ పోస్టర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సందర్భంగా పోస్టర్ డిజైనర్ ఏంకేయస్ మనోజ్ మీడియాతో ముచ్చటించారు.

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్లు.. ఒక్కొక్కరికి ఎన్ని లక్షలో తెలుసా?

సగిలేటి కథ మూవీ అవకాశం ఎలా వచ్చింది? అని అడిగితే తనకు ఈ సినిమా అవకాశం ప్రొడ్యూజర్ దేవి ప్రసాద్ వల్ల వచ్చిందని అన్నారు. షేడ్ స్టూడియోస్ కాంపౌండ్ లో నేను ఎన్నో డిజైన్స్ చేయడం వాటికి బాగా రెస్పాన్స్ రావడం, అది దేవి గారికి నచ్చడంతో నాకు ఈ సినిమా అవకాశాన్ని కల్పించారని చెప్పుకోచారు. మా సినిమా పోస్టర్స్ రీలిజ్ అయ్యాక పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని నేను, నా టీమ్ సూపర్ హ్యాపీ అని ఆయన అన్నారు.

సగిలేటి కథ డైరెక్టర్ గురించి కొన్ని విషయాలు చెప్పమంటే సగిలేటి కథ డైరెక్టర్ డిజైన్స్ విషయంలో చాలా పర్టిక్యులర్ & ఎంతో క్లారిటీగా ఉంటారని, అదే విధంగా నాకు ఫ్రీడమ్ ఇస్తూనే సపోర్ట్ చేశారని అన్నారు. అలా ఇద్దరి మధ్య కో-ఆర్డినేషన్ ఉండటం వల్ల ఔట్ ఫుట్ మంచిగా వచ్చిందని అన్నారు. ఈ ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ, అవకాశాలు అంతగా వచ్చేవి కావని పేర్కొన్న ఆయన 2 – 3 నెలలకు ఒక్క సినిమా కూడా వచ్చేది కాదని అన్నారు. ఆ టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది, వచ్చిన ఫిలిమ్స్ కూడా ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అయ్యేదని అన్నారు. ఇప్పుడు సాఫీగా సాగుతుందని, ఇప్పటివరకు 230+ షార్ట్ ఫిలింస్, 90+ ఇండిపెండెంట్ ఫిలింస్, 80+ ఫిలింస్మొత్తం కలిపి దాదాపు 400+ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేశానని అన్నారు.

సినిమాకి ప్రధాన బలం పోస్టర్ డిజైనింగ్ అని, ఎందుకంటే ఏ సినిమాకి అయినా మొదటగా రిలీజ్ చేసేది టైటిల్ & ఫస్ట్ లుక్, ఈ పోస్టర్స్ తోనే మన సినిమా ఏంటి అనేది చూసే వాళ్ళకి అర్ధం అవ్వాలని అన్నారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండాలి, అప్పుడే వాళ్ళు సినిమా కోసం వెయిట్ చేస్తారని అన్నారు.. ఇక తాను ఏ మాస్టర్ పీస్, అథర్వ, తుపాకులగూడెం, #AP31, అండర్ వరల్డ్ బిలినైర్స్, యద్భావం తద్భవతి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.