Site icon NTV Telugu

Saakini- Daakini Teaser: శాకిని- డాకిని దయ్యాలకంటే ఘోరంగా ఉన్నారే..

Saakini Daakini

Saakini Daakini

Saakini- Daakini Teaser: ప్రస్తుతం హీరోయిన్లు కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా వీలు దొరికితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటూ విజయాలను అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కొరియన్ సినిమాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. తాజాగా మేము ఇద్దరం కలిసి హిట్ కొట్టడానికి వచ్చేస్తున్నాం అని అంటున్నారు రెజీనా కసాండ్రా, నివేదా థామస్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘శాకిని- డాకిని’. యాక్షన్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ ఫిల్మ్ కుఈ సినిమా అధికారిక రీమేక్. హీరోల ప్లేస్ లో ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు తీసుకొని వారితో కామెడీ చేయించాడు దర్శకుడు సుధీర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

శాకిని- డాకిని టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పోలీస్ అకాడమీలో జాయిన్ అయిన షాలిని, దామిని అనే ఇద్దరు యువతుల కథ ఇది. షాలినికి ఆకలి ఎక్కువ.. దామినికి శుభ్రత ఎక్కువ. వీరిద్దరికి ఒకే రూమ్ ఇస్తారు. అక్కడి నుంచి వీరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం. కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివి ఎంతో కామెడీగా చూపించారు. ఇక వీరు అకాడమీ నుంచి అనుకోకుండా బయటికి వచ్చి ఒక అమ్మాయి కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటారు. అక్కడి నుంచి వీరిద్దరూ ఎలా బయటపడ్డారు.. ఆ కిడ్నాప్ గ్యాంగ్ ను ఎలా పోలీసులకు పట్టించారు. బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు యువతులు స్నేహితులుగా ఎలా మారారు..? అనేది సినిమాగా తెలుస్తోంది. షాలిని గా నివేదా, దామిని గా రెజీనా పాత్రలకు తగ్గట్టు కనిపించారు. అకాడమీలో వీరి అల్లరి చూస్తుంటే శాకిని- డాకిని దయ్యాలంటే ఘోరంగా ఉందని చెప్పొచ్చు. ఇక చివర్లో టైటిల్ కు జస్టిఫై చేసేలా డైలాగ్ చెప్పించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఈ ముద్దుగుమ్మలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version