టాలీవుడ్ సింగర్ ఎస్.పీ. చరణ్ చెన్నైలోని కేకే నగర్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఒక ఫిర్యాదు నమోదు చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ తిరుజ్ఞానం పై ఆయన కేసు పెట్టారు. చరణ్ వివరాల ప్రకారం.. సాలిగ్రామంలోని సత్యా గార్డెన్స్ లో తనకు ఒక ఫ్లాట్ ఉందని, ఆ ఫ్లాట్‌ను తిరుజ్ఞానం నెలకు రూ.40,500 అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. మొదట్లో రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినా, ఆ తర్వాత గత 25 నెలలుగా ఒక్క రూపాయి అద్దె కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఇందువల్ల బకాయి మొత్తం భారీ స్థాయిలో పెరిగిపోయి, తన కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిందని చరణ్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
S.P.Charan: అసిస్టెంట్ డైరెక్టర్‌పై పోలీస్ కేసు పెట్టిన S.P చరణ్

Sp Charan