యాభై సంవత్సరాల తెలుగు టెలివిజన్ చరిత్రలో మొదటిసారి గా ఆవిర్భవించిన తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం టెలివిజన్ ఫెడరేషన్ ఫౌండర్ రచయిత, దర్శక నిర్మాత నాగబాల సురేష్ అధ్యక్షతన తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని పాల్గొని, టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే సమయంలో తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోషియేషన్ సంఘాన్ని తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ లో ఒక భాగంగా గుర్తింపునిచ్చారు. తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రెసిడెంట్ ఎస్.ఎ. ఖుద్దూస్ కాగా ఉపాధ్యక్షులుగా సుధా, ప్రధాన కార్యదర్శిగా సాయి శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా నిహాల్, కోశాధికారిగా మోహిని, కార్యనిర్వాహక కార్యదర్శిగా వేణు యాదగౌడ్ ఎంపికయ్యారు.
తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్. ఎ. ఖుద్దూస్

SA Khuddus