Site icon NTV Telugu

Runway 34 Teaser : 35,000 అడుగుల ఎత్తులో దాగి ఉన్న నిజం

Runway-34

Runway 34 యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రానికి గతంలో ‘మేడే’ అని పేరు పెట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మూవీ పేరు Runway 34 అని మార్చారు. ఇందులో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ ‘పైలట్’ పాత్రలో నటించారు. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘రన్‌వే 34’ని కుమార్ మంగత్ పాఠక్, విక్రాంత్ శర్మ, సందీప్ హరీష్ కెవ్లానీ, తర్లోక్ సింగ్ జేథి, హస్నైన్ హుసైనీ, జే కనుజియా సహ-నిర్మిస్తున్నారు. డ్రామా థ్రిల్లర్ ప్లాట్‌తో ‘రన్‌వే 34’ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 29, 2022న విడుదల కానుంది.

Read Also : The Kashmir Files controversy : నిజాలు బయట పెట్టిన సీనియర్ నటుడు

ఈ చిత్రం 2015 జెట్ ఎయిర్‌వేస్ దోహా-కొచ్చి విమానం అస్పష్టమైన దృశ్యమానత కారణంగా ఇబ్బందులను ఎదుర్కొని, తృటిలో తప్పించుకున్న కథ ఆధారంగా రూపొందించబడింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ లో అమితాబ్, రకుల్, అజయ్ లను చూపించారు. ఈ టీజర్ ను తన సోషల మీడియా ఖాతాలో షేర్ చేసిన అమితాబ్ “భూమికి 35,000 అడుగుల ఎత్తులో నిజం దాగి ఉంది.. ఇప్పుడు #Runway34 టీజర్‌ని అనుభవించండి ..” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ నెల 21న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టుగా టీజర్ చివర్లో వెల్లడించారు.

Exit mobile version