RRR actor Ray Stevenson passes away at 58 : చిత్ర పరిశ్రమలో నేడు సెలబ్రెటీల మరణాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, నటుడు శరత్ కుమార్, యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్ మరణాలు ఇంకా మరువకముందే మరో నటుడు మృతి చెందారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ నటుడు రే స్టీవెన్‌సన్ మృతి చెందారు. థోర్ సినిమాల్లో వోల్‌స్టాగ్‌గా మెప్పించిన ఆయన RRRలో క్రూరమైన దుష్ట గవర్నర్ స్కాట్ దొరగా నటించి మెప్పించాడు. ఫ్రాంక్ సియోటా దర్శకత్వం వహించిన కాసినో ఆన్ ఇస్చియా చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడు అతను ఇస్షియా ద్వీపంలో ఆసుపత్రి పాలయ్యాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఆయన మృతి పట్ల ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
Ray Stevenson : బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ స్కాట్ దొర ఇకలేరు
![Ray Stevenson](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/05/ray-stevenson.jpg)
Ray Stevenson