నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకు పెళ్లి నాతోనా.. లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా’ అంటూ రోషన్ చెప్పిన సంబాషణలు బాగున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
‘పెళ్లి సందD’ టీజర్ ను విడుదల చేసిన నాగార్జున
