NTV Telugu Site icon

RGV: పిఠాపురం నుంచి పవన్‌పై రామ్ గోపాల్ వర్మ పోటీ?

RGV-and-pawan

RGV to Contest from Pithapuram against Pawan Kalyan: గత కొద్దిరోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ఒకసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని ఒకసారి. లేదు కాకినాడ ఎంపీ బరిలో దిగుతున్నారని మరోసారి కాదు కాదు మచిలీపట్నం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని ఇంకోసారి ఇలా రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తూ వచ్చాయి. వాటన్నింటికీ బ్రేకులు వేస్తూ పిఠాపురంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు సోషల్ మీడియా మీటింగ్ లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Vijay Sethupathi : విజయ్ సేతుపతిలో ఈ టాలెంట్ కూడా ఉందా?

అయితే పవన్ కళ్యాణ్ అలా ప్రకటించారో లేదో వెంటనే రాంగోపాల్ వర్మ కూడా తాను ఒక సడన్ డెసిషన్ తీసుకున్నానని దాని ప్రకారం పిఠాపురం నుంచి తాను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మీద రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొంత మంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడేమో అని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడేమోనని కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది ట్విట్టర్లో రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది ప్రాంక్ అయి కూడా ఉండవచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వైసీపీకి ఇప్పటికే అక్కడ సమన్వయకర్తలు ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు అలాగే రిస్క్ తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒకవేళ డిపాజిట్లు కూడా రాకుండా ఉంటే పరువు పోతుంది కాబట్టి అంత సాహసానికి కూడా ఆయన పూనుకోడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.