Site icon NTV Telugu

Satyabhama: సత్యభామ నటీనటుల కోసం వరంగల్‌లో స్టార్ మా రిసెప్షన్‌

Satyabhama Reception

Satyabhama Reception

స్టార్ మా వరంగల్‌లో తమ “సత్యభామ” షోలో ఎక్కువ మంది అభిమానించే పాత్రలు సత్యభామ – క్రిష్‌ల కోసం ఆకట్టుకునే రీతిలో రిసెప్షన్‌ను నిర్వహించింది. ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న సత్యభామ – క్రిష్‌ల ఆన్-స్క్రీన్ వివాహాన్ని ఈ కార్యక్రమంలో షూట్ చేశారు. ఈ రిసెప్షన్ షో కు ప్రత్యేకమైన ప్రచారంగా ఉపయోగపడింది. మార్చి 10, ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి వరంగల్‌లోని వెంకటేశ్వర కన్వెన్షన్ , గార్డెన్‌లో ఈ రిసెప్షన్ జరిగింది. అభిమానులు తమ అభిమాన టీవీ తారలను కలుసుకుని, పలకరించడానికి, సరదా ఆటలు ఆడుకోవడానికి మరియు సత్యభామ మరియు క్రిష్‌లతో సరదాగా గడిపేందుకు అత్యుత్తమ అవకాశం అందించింది. ఇక రిసెప్షన్ సమయంలో సత్యభామ తనకు ప్రపోజ్ చేయమని క్రిష్‌ని ఆటపట్టించడం, క్రిష్ సెల్ఫీ వీడియోను స్విచ్ ఆన్ చేసి, మొత్తం ప్రేక్షకులను తనతో పాటుగా “నేను సత్యభామను ప్రేమిస్తున్నాను” చెప్పమని, ప్రేక్షకులలో ఉత్సాహం తారాస్థాయికి తీసుకువెళ్ళాడు. క్రిష్ మరియు సత్యభామ ఇద్దరూ వేదికపై నృత్యం చేయడం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ఇక ప్రస్తుతం, “సత్యభామ” ఎపిసోడ్‌లు ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతున్నాయి. సత్యభామ మరియు క్రిష్‌ల ప్రేమకథ ప్రేక్షకులను అశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ రిసెప్షన్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది.

Exit mobile version