Site icon NTV Telugu

ART Cinemas: థియేటర్ల బిజినెస్ లోకి రవితేజ.. ఏషియన్ తో కలిసి అక్కడ మల్టీప్లెక్స్

Raviteja

Raviteja

Raviteja – Asian ART Cinemas Multiplex to be launched soon: ప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు చాలా మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి తమ సొంత సినిమాలు నిర్మించడమే కాదు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇక మరొక పక్క ఏషియన్ సంస్థతో కలిసి దియేటర్ల బిజినెస్ లోకి కూడా దిగుతున్నారు హీరోలు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి, అల్లు అర్జున్ త్రిబుల్ ఎ, విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ మల్టీప్లెక్స్ తో పాటు ఇప్పుడు రవితేజ కూడా అదే బిజినెస్ లోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. వీరితో ఈ మల్టీప్లెక్స్ లో భాగస్వామ్యం చేసి పాపులర్ అయిన ఏషియన్ సంస్థ ఇప్పుడు మరోసారి మరో మల్టీప్లెక్స్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంది.

Bhimaa: గూజ్ బంప్స్ తెప్పించేలా భీమా టైటిల్ సాంగ్

దిల్షుక్నగర్ ప్రాంతంలో ఆరు స్క్రీన్ల గల ఒక అత్యాధునిక మల్టీప్లెక్స్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు మరో ఆరు నెలల్లో దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. నిజానికి రవితేజ కూడా ఒకపక్క నిర్మాతగా మారి పలు సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన తన సొంత సినిమాల కంటే ఇతరులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వైవా హర్ష హీరోగా తెరకెక్కిన సుందరం మాస్టర్ అనే సినిమా కూడా రవితేజ బ్యానర్ లో నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.

Exit mobile version