సూపర్ స్టార్ మహేష్ బాబుకు కలిసొచ్చిన “కర్నూలు “కొండారెడ్డి బురుజు”ను వాడుకోవడానికి మరో హీరో రెడీ అయిపోయాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని “కొండారెడ్డి బురుజు” వద్ద తన విలన్ తో ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడని సమాచారం. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్నారు. “రాపో19” అనేది ద్విభాషా ప్రాజెక్ట్. ఇందులో రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఇప్పుడు రామ్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో యూనిట్ టాకీ పోర్షన్‌ను చిత్రీకరిస్తోంది.
Read Also : “సర్కారు వారి పాట”లో కీర్తి రోల్ రివీల్ చేసిన మహేష్
తాజా అప్డేట్ ఏమిటంటే “రాపో19” రామ్, ఆది మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను మేకర్స్ రూపొందించనున్నారు. ఆ షూటింగ్ కు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన “కొండారెడ్డి బురుజు” వేదికైంది. “రాపో19” హీరో, విలన్ మధ్య జరిగే యుద్దానికి “కొండారెడ్డి బురుజు” సాక్ష్యంగా నిలవబోతోందన్న మాట. మరి మహేష్ లాగే ఈ చారిత్రాత్మకమైన కోట రామ్ కు కూడా సెంటిమెంట్ గా మారుతుందేమో చూడాలి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో రైట్స్ ఇప్పటికే భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ రామ్ పోతినేని నటిస్తున్న ఈ సినిమా ఆడియో హక్కుల కోసం ఏకంగా రూ.2.75 కోట్లు ఖర్చు చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల ఆడియో హక్కులను సొంతం చేసుకున్నారు.
