Site icon NTV Telugu

Harsha Sai: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మైయిల్.. హర్షసాయిపై రేప్ కేసు నమోదు

Harsha Sai Rape Case

Harsha Sai Rape Case

Rape Case on YouTuber Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పీఎస్ లో రేప్ కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ మీద కుడా సదరు యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తన వద్ద రెండు కోట్లు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది ఆమె.

Jayam Ravi: నన్ను ఇంటి నుంచి గెంటింది.. భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు

ఇక ఆ యువతి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన నార్సింగి పోలీసులు 328, 376 (2) 354 , 376n సెక్షన్ల కింద యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదు చేశారు. ఇక లైంగిక దాడి కేసుతో పాటు బాధితురాలి న్యూడ్ వీడియోలను, ఫోటోలను తీసుకున్నాడంటూ హర్ష సాయి పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫోటోలు, వీడియోలు ఆధారంగా తనని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version