తాజాగా జరిగిన జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుకలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తన ప్రత్యేక స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో రాణీ, మెడలో తన కుమార్తె అదిరా పేరుతో తయారు చేసిన గొలుసును ధరించి హాజరయ్యారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాణీ తాజాగా ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారో వివరించారు.
Also Read : The Paradise : ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు పవర్ ఫుల్ లుక్ రిలీజ్..
‘నా కుమార్తె అదిరా ఈ వేడుకలో నేరుగా హాజరు కావాలనుకుంది, నేను అవార్డు తీసుకున్నప్పుడు నా పక్కన ఉండాలని ఎంతో ఆశ పడింది. కానీ 14 ఏళ్ల లోపు పిల్లలకు వేడుకలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ కారణంగా అదిరా రాలేకపోయింది. నా పక్కన ఉండలేకపోయింది కాబట్టి, తనతో ఉన్నట్లు అనిపించడానికి ఆమె పేరుతో గొలుసు తయారు చేసి వేసుకున్నాను.. అదిరా నా అదృష్టం’ అని రాణీ తెలిపారు. రాణీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ ఘటనా గురించి ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. గొలుసును హైలైట్ చేసిన రీల్స్ చాలా వైరల్ అయ్యాయి, ఇవి చూసిన రాణి తన కుమార్తెకు చూపించగా, అదిరా చాలా సంతోషపడింది. రాణీ ముఖర్జీ ఇలా తన కుమార్తెతో ప్రత్యేక బంధాన్ని వ్యక్తం చేయడం, బాలీవుడ్‌లో ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది.
