Rangarajan Reveals Hanuman’s Suicidal Tendency: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి తెలుగు సూపర్ హీరో సినిమాగా ముందు నుంచి దీన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. మొదటి అటు నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ రోజుకి 250 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించి ఒక గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ గ్రాటిట్యూడ్ మీట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ ఒకానొక సమయంలో హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ రామాయణంలోని సుందర కాండలో ఈ విషయం పేర్కొన్నారని ఆయన చెప్పుకొచ్చారు. లంకకు వెళ్లి సీతాదేవిని వెతుకుతున్న సమయంలో ఆమె కనిపించకపోవడంతో నిరాశ చెంది హనుమంతుడు చనిపోవాలని భావించాడని ఆయన అన్నారు.
RGV: చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను
ఒకవేళ ఇంత కష్టపడి ఇక్కడికి ఎగిరి వచ్చి ఆమె కనిపించక మళ్ళీ వెనక్కి వెళ్లి రాములవారికి చెబితే ఆయన పరిస్థితి ఏమిటి? వానర సైన్యం పరిస్థితి ఏమిటి? అయోధ్య వాసుల పరిస్థితి ఏమిటి? మిధిలా వాసుల పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు, అంతమంది ప్రాణత్యాగం చేయడం కంటే నేను నా ప్రాణం త్యాగం చేస్తే మంచిది కదా అని భావించినట్లు రంగరాజన్ వెల్లడించారు. ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆయన ఆలోచించారని కూడా ఆయన పేర్కొన్నారు. చెట్టుకి ఉరేసుకోవాలి లేదా నిప్పుల్లో దూకాలి లేదా సముద్రంలో పడిపోతాను అదీ కుదరకపోతే ఆహారమే స్వీకరించుకుండా అలా పడుకుంటాను ఏదో ఒక క్షుద్ర జంతువు వచ్చి నన్ను తినేస్తుంది అని ఆలోచించిన తరువాత మళ్లీ ఆయన స్వయంగా తనకు తాను సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని సీతమ్మవారిని వెతకడానికి బయలుదేరి వెళ్లాడని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.